వేములవాడలో తప్పిపోయిన బాలిక అప్పగింత

వేములవాడలో  తప్పిపోయిన బాలిక అప్పగింత

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి ఓ బాలిక తప్పిపోగా బ్లూకోల్ట్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. జనగాం జిల్లాకు చెందిన  శ్రీకాంత్​ కుటుంబం సోమవారం వేములవాడకు వచ్చారు. 

శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వెళ్తుండగా శ్రీకాంత్ కూతురు స్నేహిత(10ఏళ్లు) తప్పిపోయింది. గంట సేపు వెతికినా దొరకపోవడంతో డయల్‌‌‌‌‌‌‌‌ 100 కు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులకు అప్పగించారు.