తీరు మార్చుకోకపోతే ఉరికిచ్చి కొడతాం..పవన్ కు బల్మూరి వార్నింగ్

తీరు మార్చుకోకపోతే ఉరికిచ్చి కొడతాం..పవన్ కు బల్మూరి వార్నింగ్

పవన్ కల్యాణ్ గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. 

పవన్ కల్యాణ్కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని సూచించారు తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్ప భగ్గుమన్నారు.

పవన్ ఏమన్నారంటే.?

గోదావరి జిల్లాలను అన్నపూర్ణ అంటారు... రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే..ఆ శాపం తగిలేసినట్టుంది..గోదావరి జిల్లాలు మొత్తం కొబ్బరి చెట్లతోటి ఉంటాయి.. తెలంగాణ నాయకులంతా పచ్చదనంతో కోనసీమ బాగుంటది అంటరు.. పచ్చదనంతో ఆనందంగా ఉంటారు మీరంతా అంటారు.. ఇవాళ కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు.. అంత దిష్టితగిలింది. కోన సీమకు..నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందంటారు.. అలాంటిది.. కోనసీమ పచ్చదనం.. ఎంత మంది దిష్టి తగలిందో.. ఇవాళ మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే.. దీనిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది

►ALSO READ | పవన్ వ్యాఖ్యల దుమారం.. ఏపీ ,తెలంగాణ మధ్య మాటల మంటలు