టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య రీ ఎంట్రీలో సత్తా చాటాడు. డొమెస్టిక్ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటింగ్, బౌలింగ్ లో తనను తాను టెస్ట్ చేసుకున్నాడు. మంగళవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య క్రికెట్ లో అడుగుపెట్టాడు. పాండ్య ఆట చూడడానికి అభిమానాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో పాండ్య ఘోరంగా విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్ లో పాండ్య బౌలింగ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ ముందు పాండ్య పేలవ బౌలింగ్ ఆందోళనకు గురి చేస్తోంది. బౌలింగ్ లో విఫలమైన బ్యాటింగ్ లో అదరగొట్టాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగి 42 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. పాండ్య బ్యాటింగ్ లో దుమ్ములేపడం టీమిండియాకు గుడ్ న్యూస్. పాండ్య బ్యాటింగ్ లో దుమ్ములేపడంతో బరోడా 223 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అభిమానికి పాండ్య సెల్ఫీ:
ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పాండ్య బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ లోకి వచ్చాడు. సెక్యూరిటీ అతడిని చూసి వేగంగా గ్రౌండ్ లోకి వచ్చారు. ఆ యువ అభిమానిని గ్రౌండ్ లో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ దశలో హార్దిక్ పాండ్య తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. సెక్యూరిటీని ఆపి మరీ అభిమానికి సెల్ఫీ ఇచ్చి హైలెట్ గా మారాడు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఆ అభిమాని సంతోషంగా గ్రౌండ్ లో నుంచి వెళ్ళిపోయాడు.
►ALSO READ | Robin Smith: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మరణం.. 1992 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్న జట్టులో సభ్యుడు
ఆసియా కప్ లో గాయపడిన పాండ్య ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయిన పాండ్య ప్రాక్టీస్ కోసం ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడి సత్తా చాటాడు. డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బరోడా తరపున పాండ్య మంగళవారం (డిసెంబర్ 2) పంజాబ్ తో మ్యాచ్ ఆడిన పాండ్య.. గురువారం (డిసెంబర్ 4) గుజరాత్‌తో మరో మ్యాచ్ ఆడనున్నాడు.
