కొడిమ్యాల,వెలుగు: కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్ పోస్టును జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఆయనతోపాటు ఎస్ఐ సందీప్, ఆర్ఐ కర్ణాకర్ ఉన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.
