Samantha: అత్తారింట్లో అడుగుపెట్టిన సమంత.. అండగా ఉంటామంటూ రాజ్ ఫ్యామిలీ పోస్ట్.. సామ్ రిప్లయ్ ఇదే

Samantha: అత్తారింట్లో అడుగుపెట్టిన సమంత.. అండగా ఉంటామంటూ రాజ్ ఫ్యామిలీ పోస్ట్.. సామ్ రిప్లయ్ ఇదే

సమంత-రాజ్.. ఈ కొత్త జంట ఇపుడు సోషల్ మీడియాను దుమ్మురేపుతున్నారు. 2025 డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంటపై.. ఆసక్తి కలిగించే కొత్త విషయాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. వీరి వెడ్డింగ్ ఫొటోస్, ఎంగేజ్ మెంట్ రింగ్, ప్రేమ, సినీ ప్రయాణంపై కొత్త కథనాలు రివీల్ అవుతూ.. ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే సమంత తన అత్తవారింటికి, తొలి అడుగుపెట్టింది. లేటెస్ట్గా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంగళవారం (డిసెంబర్‌ 2న) హీరోయిన్ సమంతకు అత్త వారింట్లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. ఈ మేరకు రాజ్‌ సిస్టర్ శీతల్‌.. కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా సామ్-రాజ్ల పెళ్లి ఫోటోలతో పాటుగా, కొత్త జంటతో దిగిన తమ ఫ్యామిలీ పిక్ను శీతల్‌ షేర్ చేసింది. అంతేకాకుండా.. తమ ఫ్యామిలీలోకి సమంతను అధికారికంగా స్వాగతిస్తూ, ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటానని ప్రామిస్ చేసింది. 

‘‘ఇవాళ చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తున్నప్పుడు.. ప్రదోష సమయంలో తడిసి, వణుకుతూ, కన్నీళ్లతో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాను. ఇవి బాధతో కూడిన కన్నీళ్లు కాదు..  కృతజ్ఞతతో నిండిన కన్నీళ్లు" అని శీతల క్యాప్షన్ ఇచ్చింది.

అలాగే సమంత తమ ఇంటికి రావడంపై మాట్లాడుతూ.. ‘సమంత రాకతో మా ఫ్యామిలీ పరిపూర్ణమైంది. సమంత-రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుండడం చూస్తుంటే.. మాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు చూపించుకుని గౌరవం, ఆ నిజాయతీ.. వారికి ప్రశాంతమైన కొత్త మార్గాన్ని ఇస్తాయి. సమంత-రాజ్ లకు మా కుంటుంబం అంతా ఎప్పుడూ అండగా ఉంటాము’’ అని భరోసా ఇస్తూ శీతల తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. అలాగే, కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు ఆమె థ్యాంక్స్ తెలిపింది.

ఈ క్రమంలోనే తన ఆడపడుచూ రాసుకొచ్చిన పోస్ట్‌కు సమంత స్పందిస్తూ.. ‘లవ్‌ యూ.. థ్యాంక్యూ మై డార్లింగ్.. నీ ఆహ్వానానికి ఫిదా.. మీరు మన ఫ్యామిలీలో ఉండటం చాలా అదృష్టం’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత తన భర్త రాజ్ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ వైరల్ గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు.   

సమంత, రాజ్ లవ్ స్టోరీ..

సమంత, రాజ్ నిడిమోరుల ప్రయాణం వృత్తిపరంగా మొదలై ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి తొలిసారిగా సమంత మొదటి OTT ప్రాజెక్ట్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (The Family Man 2) లో పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ'  సిరీస్‌లో పనిచేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'రక్త్ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్' సిరీస్‌లో కూడా వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగులో 'మా ఇంటి బంగారం' మూవీలో నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, అలాగే హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.