ఢిల్లీలో కూలిన రెండంతస్తుల భవనం

ఢిల్లీలో కూలిన రెండంతస్తుల భవనం

న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మరమ్మతులు చేస్తున్న రెండతస్తుల భవనం భారీ వర్షాలకు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిలాల కింద కొంత మంది  చిక్కుకుపోయారు. మోడల్ టౌన్ ప్రాంతంలో మహేంద్రు ఎన్‌క్లేవ్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం మెంబర్స్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. 

సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలంలో మూడు ఫైరింజన్లను కూడా మోహరించారు. శిథిలాల కింద నుంచి మూడు డెడ్ బాడీలను వెలికి తీశారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.