బోరుబావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

బోరుబావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
  • మధ్యప్రదేశ్​లో విషాదం  

భోపాల్: మధ్యప్రదేశ్‌‌లోని సెహోర్ జిల్లా ముంగవోళి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన చిన్నారి సృష్టి కథ విషాదాంతమయ్యింది. 135 అడుగుల లోతు నుంచి గురువారం సాయంత్రం సృష్టిని బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది.. పాపను అంబులెన్స్‌‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు.

దాదాపు 52 గంటలు బోర్‌‌వెల్ లో ఉండటంతో ఆక్సిజన్ అందక చిన్నారి చనిపోయిందని పోలీసులు తెలిపారు. మంగళవారం బాలిక ఆడుకుంటూ సుమారు 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. ఎన్‌‌డిఆర్‌‌ఎఫ్, ఎస్‌‌డిఇఆర్‌‌ఎఫ్, రోబోటిక్ టెక్నాలజీ సిబ్బంది దాదాపు 52 గంటలు శ్రమించి సృష్టిని బయటకు తీశారు. కానీ అప్పటికే పాప చనిపోయింది.