పుతిన్​పై తిరుగుబాటు

పుతిన్​పై తిరుగుబాటు

పుతిన్​పై తిరుగుబాటు మొదలైందన్న ఉక్రెయిన్​ మేజర్​ జనరల్​

కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందా? పుతిన్​ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నారు ఉక్రెయినియన్​ మిలిటరీ అధికారి ఒకరు. పుతిన్​ను గద్దె దించేందుకు ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఉక్రెయిన్​ మేజర్​ జనరల్​ కిరిలో బుడనోవ్​ చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ ​యుద్ధం ఆగస్టు మధ్య లేదా ఈ ఏడాది చివరి నాటికి కీలక దశకు చేరుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యా ఓటమిపాలైతే, పుతిన్​ను అధికారం నుంచి తొలగిస్తారని, ఆ దేశం కుప్పకూలిపోతుందని అన్నారు. ‘‘ఉక్రెయిన్​ యుద్ధం రష్యన్​ ఫెడరేషన్​ నాయకత్వంలో మార్పులకు కారణం అవుతోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆ దారిలోనే కొనసాగుతోంది. దీనిని ఆపడం అసాధ్యం”అని చెప్పారు. ఉక్రెయిన్​ వార్​లో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, యూరోప్​రష్యాను పెద్ద ముప్పుగా చూస్తోందని, ఇన్నాళ్లూ అందరూ భావిస్తున్నట్టుగా రష్యా సూపర్​ పవర్​ అనేది అవాస్తవమని బుడనోవ్​ చెప్పారు.

ఉక్రెయిన్​లో రష్యాకు అడ్డంకులు

ఉక్రెయిన్​ యుద్ధంలో రష్యాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో కీవ్, ఖార్కివ్​ లాంటి నగరాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలు నత్తనడకన సాగుతున్నాయి. అయితే పారిశ్రామిక ప్రాంతమైన డాన్​బాస్​ ఏరియాలో మాత్రం ఇరు వర్గాల మధ్యా తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతోంది. కాగా, నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్​ మరోసారి స్పష్టంచేసింది. దీనిపై చర్చించేందుకు బెర్లిన్​లో నాటో డిప్లమాట్స్ సమావేశమయ్యారు. నాటోలో చేరే విషయంపై స్వీడన్​ గవర్నింగ్​ పార్టీ కూడా సానుకూలంగానే ఉంది. త్వరలోనే దీనిపై ప్రకటన 
వెలువడే అవకాశం ఉంది.

ప్రెసిడెంట్​కు అనారోగ్యం?
పుతిన్​ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని బ్రిటన్​ గూఢచారి క్రిస్టోఫర్​ స్టీల్స్ వెల్లడించారు. అయితే ఆ అనారోగ్యం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా, ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారనేది నిజమని చెప్పారు. పుతిన్ బ్లడ్​ క్యాన్సర్​తో బాధపడుతున్నారని ఆయన సన్నిహి త పారిశ్రామికవేత్త ఒకరు చెప్పారు. రష్యా పారిశ్రామికవేత్త, వెస్ట్రన్​ కంట్రీస్​కు చెందిన పెట్టుబడిదారుతో మాట్లాడి న ఆడియో క్లిప్​ను అమెరికాకు చెంది న న్యూలైన్స్​ మ్యాగజీన్​ విడుదల చేసింది. ఇందులో వారిద్దరూ పుతిన్​ ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించారు. ఉక్రెయిన్​పై చొరబాటుకు కొద్దిరోజుల ముందు బ్లడ్​ క్యాన్సర్​కు సంబంధించి పుతిన్​ సర్జరీ చేయించుకున్నట్టు ఆయన చెప్పారు. పుతిన్​ చనిపోవాల ని అందరూ కోరుకుంటున్నారని, రష్యా, ఉక్రెయిన్ తోపాటు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను పుతిన్​ దెబ్బతీశారని, తప్పుడు నిర్ణయాలతో ప్రపంచాన్ని తలకిందులు చేశారని చెప్పారు. అయితే పుతిన్​ ఆరోగ్యంపై ఇప్పటి వరకు క్రెమ్లిన్​ 
ఎలాంటి ప్రకటనా చేయలేదు.