
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రామాలయ భూమి పూజ కార్యక్రమంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి పాల్గొననున్నారని తెలిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ, జోషి ఈవెంట్‌లో పాల్గొంటారని సమాచారం. ఇరు నేతలు రామ జన్మభూమి ఉద్యమానికి రెండు ముఖాలుగా ఉద్యమించిన విషయం తెలిసిందే. వీరిని భూమి పూజకు రావాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ జనరల్‌తోపాటు రామ జన్మ హూమి తీర్థ్ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆహ్వానించారు. అయితే ఇన్విటేషన్స్ ఎప్పుడు పంపారనే దానిపై స్పష్టతను ఇవ్వలేదు. భూమి పూజకు ప్రధాని మోడీ, ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే అవకాశాలున్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా ఈ ఈవెంట్‌లో పాలుపంచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.