చెట్టును దైవంగా భావించి పూజించే సంప్రదాయం మనది. ఇంట్లో ఒక చెట్టుందంటే దాన్ని ఇంటి మనిషితో సమానంగా ప్రేమిస్తాం. అలా ఒక చెట్టు ఎన్నో తరాలుగా మనుషుల్లో మమేకమైతే, దాన్ని కొట్టేస్తారంటే ఊరుకుంటారా? పోరాటం చేసైనా చెట్టును కాపాడుకునే ధైర్యం మనలో ఎప్పట్నుంచో ఉంది. ఇదే పంథాలో ఇటీవల మహారాష్ట్ర ప్రజలు 400 ఏళ్ల మర్రి చెట్టును కాపాడుకున్నారు.
అది మహారాష్ట్రలోని మీరజ్ పట్టణానికి దగ్గర్లో ఉన్న గ్రామం భోస్. అక్కడ 400 ఏళ్లనాటి మర్రిచెట్టు ఒకటి చరిత్రను భావితరాలకు చెప్పేందుకు ఇప్పటికీ ఉంది. అలాంటి చెట్టు ను రత్నగిరి– కొల్లా పూర్ మీరజ్– సోలాపూర్ ఎక్స్ ప్రెస్ వేకి సంబంధించిన రోడ్ ప్రాజెక్ట్ కోసం కొట్టే యాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయం భోస్ గ్రామస్తులకు తెలిసింది. దాంతో తరతరాలను చూసిన చెట్టు ను నరకడానికి వీల్లేదని ఒక క్యాంపెయిన్ నడిపారు.
అధికారులు దిగొచ్చేదాకా..
భోస్ గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరకు చేరి, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. తరతరాలకు సాక్ష్యంగా ఉన్న చెట్టును నరకొద్దంటూ చేతిలో ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఒకవారం పాటు అక్కడి వాళ్లు ఆన్ లైన్ లో తమ క్యాంపెయిన్ ని జోరుగా చేశారు. దాంతో ఇటీవల ఎన్ హెచ్ ఏఐకి చెందిన అధికారులు చెట్టు మొండెం(ట్రంక్) సర్వీస్ రోడ్డు దారిలోకి వస్తున్నా దాన్నేమీ ముట్టుకోమని చెప్పారు. కేవలం చుట్టూ ఉన్న కొమ్మలను మాత్రమే నరికేస్తామని హామీ ఇచ్చారు. చెట్టును కాపాడేందుకు సర్వీస్ రోడ్ ప్లాన్ మారుస్తామన్నారు.
సోషల్ మీడియా తోడ్పడింది
అక్కడి గ్రామస్తులు ఫేస్ బుక్ లో ‘సహ్యా ద్రి సంఘటన’ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. దాంట్లో చెట్టు కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, ఆ చెట్టు ప్రాముఖ్యం, అవసరం గురించి వివరించారు. చెట్టు ను నరికేస్తే దానిమీద ఆధారపడ్డ పక్షులు, జంతువులు ఏమైపోతాయన్న కాన్సెప్ట్‌తో వీడియోలు తీసి షేర్ చేశారు. అలాగే ఎల్లమ్మ గుడికి వచ్చే సందర్శకులు కూడా ఈ క్యాంపెయిన్ లో పాల్గొని, తాము చెట్టు కింద కూర్చుని భోజనం చేసిన ఫొటోలు, మెమొరీ కోసం చెట్టు తో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
‘‘మా ఎల్లమ్మ గుడి దగ్గరున్న మర్రిచెట్టును నరికేస్తారని తెలియగానే మొదట షాకయ్యాం. తర్వాత ఊరంతా దీని గురించి మాట్లాడుకున్నాం . ఎలాగైనా ఆ పనిని ఆపించాలనుకున్నాం . అందుకే ర్యాలీ, ఆన్ లైన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం . కరోనా వైరస్ వ్యాప్తించకుండా గుంపులుగా కాకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మా పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మొదట్లో ఇరవై మంది ఆ చెట్టు వద్దకు చేరి చిప్కో మూమెంట్ లాగా మా నిరసనను వ్యక్తం చేశాం. తర్వాత ఇంకొంతమంది చేరారు. ఆపైన సోషల్ మీడియాలో మా ఫొటోలు, మర్రిచెట్టు చరిత్ర, దాని గొప్పతనం గురించి షేర్ చేశాం. ఇలా చివరగా ప్రభుత్వం మా చెట్టు ను కొట్టే యమని మాట ఇవ్వడంతో గ్రామస్తులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నా’’మని చెప్తున్నాడు భోస్ గ్రామస్తుడు దినేశ్ .
చిప్కోనే ఇప్పటికీ స్ఫూర్తి
ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన క్యాంపెయిన్ కి ముందు.. అంటే1973లో ఉత్తరాఖండ్‌లోని గోపేశ్వర్‌లో 300 చెట్లను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ (అప్పట్లో ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉండేది) సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొ క్కరూ ఒక్కో చెట్టు ను హత్తుకుని చెట్లను నరకాలనుకుంటే వాటితోపాటు తమనూ నరకండని హెచ్చరించారు. అలా చిప్కో (ఆలింగనం) ఉద్యమం ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే గిరిజనులు ఆ ప్రాంతంలోని అడవులను కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేశారు.
పర్యావరణశాఖ చొరవతో..
నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మర్రిచెట్టు ను నరికేసేందుకు ఆదేశాలు రావడంతో, మహారాష్ట్ర టూరిజం అండ్ ఎన్విరాన్ మెంట్ మినిష్టర్ ఆదిత్య థాకరే ఆ గ్రామస్తులకు అండగా నిలిచారు. ‘‘రత్నగిరి–సోలాపూర్ హైవే కోసం ఆ ఊరి మీదుగా వెళ్తున్న స్టేట్ హైవే 166 రోడ్ ప్లాన్ ని మార్చాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆ మర్రిచెట్టు 400 ఏళ్లనాటిది. పైగా 400 స్క్ వేర్ మీటర్లుగా ఉన్న ఆ చెట్టు విస్తీర్ణంలోనే ఎల్లమ్మ దేవత గుడి ఉంది. భక్తులు కొన్నేళ్లుగా ఆ గు డిలోని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. పైగా ఆ చెట్టు ఉన్న ప్రాంతంలో కొన్ని వందల జాతుల పక్షులు, జంతువులు జీవనం సాగిస్తున్నాయి. అందువల్ల సర్వీస్ రోడ్డు కోసం చెట్టు ను కొట్టేయకుండా పర్యావరణాన్ని కాపాడండి” అని రోడ్డు రవాణా, రహదారులశాఖ కేం ద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, థాకరే లేఖ రాశారు. దానికి ఇటీవలే మంత్రి గడ్కరీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) తమ ప్లా నింగ్ లో మార్పులు చే సేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెప్తు న్నారు.

