Weekend OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10కి పైగా సినిమాలు.. క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో

Weekend OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10కి పైగా సినిమాలు.. క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో

OTTలోకి కొత్త సినిమాలు దర్శనం ఇచ్చాయి. మార్చి చివరి వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు భారీగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి.  ఇవాళ మార్చి 27న ఒక్కరోజే 10కి పైగా కొత్త కంటెంట్ విడుదల కావడం విశేషం. మొత్తం ఈ లాస్ట్ వీకెండ్‌లో దాదాపు 20కి పైగా ఇంట్రెస్టింగ్ మూవీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్, సైకాలజికల్, రొమాంటిక్, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు వచ్చి అలరిస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.. 

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

మర్దానీ 3 (హిందీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్) – మార్చి 27

మస్తిష్క మరణం (మలయాళం సై-ఫై డార్క్ కామెడీ థ్రిల్లర్) – మార్చి 27

BTS: ది రిటర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ) – మార్చి 27

53 సండేస్ (స్పానిష్ కామెడీ డ్రామా) – మార్చి 27

అనకొండ (ఇంగ్లీష్ మూవీ)

సమ్‌థింగ్ వెరీ బ్యాడ్లీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ (ఇంగ్లీష్/తెలుగు)

జియో హాట్‌స్టార్ (JioHotstar)

ముత్తు అలియాస్ కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ యాక్షన్ సిరీస్) – మార్చి 27

డేర్‌డెవిల్ సీజన్ 2 (క్రైమ్ యాక్షన్ సూపర్‌హీరో)

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)

ఓ రోమియో (హిందీ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా) – మార్చి 27

హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్) – మార్చి 27

ప్రెటీ లేథల్ (ఇంగ్లీష్/తెలుగు)

గోట్ (ఇంగ్లీష్ మూవీ)

హౌ టు మేక్ ఎ కిల్లింగ్ (ఇంగ్లీష్ మూవీ)

ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ 2 (ఇంగ్లీష్ మూవీ)

బైట్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

వార్ డ్రైవర్ (ఇంగ్లీష్ మూవీ)

జీ5 (ZEE5)

ప్రజాపతి 2 (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా) – మార్చి 27

హే కే నవీన్ (మరాఠీ రొమాంటిక్ డ్రామా సిరీస్) – మార్చి 27

శబ్దం (తమిళ మూవీ)

లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)

వళతు వషతే కల్లన్ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్) – మార్చి 27 (మనోరమ మ్యాక్స్‌లో కూడా)

రిటర్న్ టు ది జురాసిక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్) – మార్చి 27

ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+)

ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్ సీజన్ 5 (సై-ఫై డ్రామా సిరీస్) – మార్చి 27

సన్ నెక్ట్స్ (Sun NXT)

మాయ బింబుమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా) – మార్చి 27

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు చూస్తే, ప్లాట్‌ఫాంల మధ్య కంటెంట్ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్-థ్రిల్లర్ జానర్ డామినేట్ చేయడం, గ్లోబల్ కంటెంట్ తెలుగు డబ్బింగ్‌లో రావడం ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ లిస్టులో మర్దానీ 3, ముత్తు అలియాస్ కాట్టాన్, మస్తిష్క మరణం, ఓ రోమియో, శబ్దం మూవీస్ ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి.