వైరల్ వీడియో: మహిళను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్

వైరల్ వీడియో: మహిళను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్

రాను రాను జనాలు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు.  ఏం చేసైనా సరే హైలెట్ అవాలని చూస్తున్నారు.  జనాలు వారి గురించే చర్చించుకోవాలని తపన పడుతున్నారు. ఓ కార్ డ్రైవర్ ఇప్పుడు అలాగే అనుకున్నాడో ఏమో తెలియదు కాని... రాజస్థాన్ లో ఓ కార్  డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు.   ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమెను రక్షించడానికి అనేకమంది పరుగులు తీసినా ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

కారు బానెట్ పై ఉన్న మహిళను ఈడ్చుకెళ్లిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.  హనుమాన్ గఢ్ మెయిన్ బస్టాండ్ సమీపంలో  500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన అక్కడున్న సీసీ రికార్డుల్లో రికార్డైంది.  ఈ వీడియోలో చాలామంది ఆమెను కాపాడటానికి వెనుక పరుగులు తీశారు.  అయినా అదేమీ పట్టించుకోకుండా కారు రయ్ రయ్ అంటూ దూసుకెళ్లింది.  సీసీటీవీలో రికార్డైన విజువల్స్ ఆధారంగా రావ్లాకు చెందిన వ్యక్తి కారని పోలీసులు గుర్తించారు. బాధిత మహిళ, కారుడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అయితే ఈ ఘటన విషయంలో రాజకీయ నేతలు స్పందించారు.  ఈ వీడియోను మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ అకౌంట్లో (Col Rajyavardhan Rathore) షేర్ చేశారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘఢ్‌లో పట్టపగలు ఓ మహిళను కారు బానెట్‌పై దుండగులు లాక్కెళ్తున్నారు. గెహ్లాట్ జీ, మీ పరిపాలనలో మహిళలపై ప్రతిరోజు ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మీకు తెలుస్తోందా? అనే శీర్షికతో పోస్టు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.