ఎద్దు దాడిలో మహిళ మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘటన

ఎద్దు దాడిలో మహిళ మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘటన

నస్పూర్, వెలుగు: ఎద్దు దాడిలో మహిళ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో ఉండే ఒనపాక కళావతి(52)  బుధవారం మున్సిపాలిటీ చెత్త బండి ఇంటి సమీపంలోకి వచ్చింది. కళావతి చెత్తను బండిలో వేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఎద్దు దాడిచేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు పెండ్లి అయింది.  మిగతా ముగ్గురికి కాలేదు. ఏడాది కింద  తండ్రి, ఇప్పుడు తల్లి మృతిచెందారు.