
హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడలో పసికందుతో సహా ఓ మహిళ గుంతలో పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడడంతో ప్రమాదం తప్పింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్ కాలనీ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు డ్రైనేజీ కోసం గుంత తవ్వారు. ఇవాళ వర్షం కురవడంతో ఆ గుంత నీటితో నిండిపోయింది. ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు వచ్చిన మహిళ కారు దిగి పసికందును ఎత్తుకుని నడుచుకుంటూ వచ్చి ఆ గుంతలో పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి రక్షించడం తో ప్రమాదం తప్పింది.