108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

జన్నారం, వెలుగు: 108 వాహనంలోనే ఓ మహిళా ప్రసవించింది. ఆడ శిశువుకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 వాహన పైలట్లు కిషన్, రఫీక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం కవ్వాల్ గ్రామానికి చెందిన శ్యామల పురిటినొప్పులతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి శ్యామలను వాహనంలో ఎక్కించుకొని హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించినట్లు చెప్పారు. తదుపరి పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.