
కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నడుస్తున్న బోట్లో నుంచి నీటిలో దూకింది. వెంటనే అలర్ట్ అయిన బోట్ సిబ్బంది ఆ మహిళను ప్రాణాలతో కాపాడారు.
లోయర్ మానేరు డ్యాంకు కొన్ని రోజులుగా పర్యాటకులు వస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ మహిళ టికెట్ కొని బోట్ ఎక్కింది .. స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి నీటిలో దూకేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మహిళకు లైఫ్ జాకెట్ విసిరి డ్యాంలో నుంచి బయటకు లాగారు. బోట్ సిబ్బంది మహిళను లేక్ పోలీసులకు అప్పగించారు. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మహిళను సుభాష్ నగర్ కు చెందిన సంధ్యగా గుర్తించారు.