- మహిళ మృతి
- పెద్దపల్లి జిల్లా లక్కారంలో ఘటన
ముత్తారం, వెలుగు : బతుకమ్మ ఆడుతుండగా గుండె పోటు వచ్చి మహిళ మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన మాదాసి స్వరూప(55)
బుధవారం సాయంత్రం పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెండ్లిళ్లు అయ్యాయి. మృతురాలి భర్త కొన్నాళ్ల కింద మృతి చెందాడు.