స్తంభం దిగుతావా, రాయితో కొట్టమంటవా?..లైన్ మెన్ ను బెదిరించిన మహిళ

V6 Velugu Posted on Sep 26, 2021

సమయానికి బిల్లు కట్టలేదని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తుండగా ఓ మహిళ అడ్డుకుంది. బిల్లు చెల్లిస్తా, కట్ చేయవద్దని బతిమిలాడింది. వినకపోవడంతో రాయితో దాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో లైన్ మెన్ భయపడి పారిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో రాజేశ్వరి కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టలేదు. దీంతో ఇంటికి కరెంట్ కట్ చేస్తానంటూ లైన్ మెన్ కరెంట్ పోల్  ఎక్కాడు. అయితే బిల్లు కడ్తానంటూ రాజేశ్వరి చెప్పింది. కరెంట్ కట్ చేయవద్దని కోరింది. అయితే లైన్ మెన్ ఆమె మాట వినకుండా కరెంట్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆగ్రహం చెందిన రాజేశ్వరి ఓ రాయి తీసుకొని స్తంభం దిగుతావా, కొట్టమంటవా అంటూ లైన్ మెన్ ను బెదిరించింది. దీంతో అతను స్తంభం దిగి పరిగెత్తాడు. బిల్లు కడ్తానని చెప్పినా లైన్ మెన్ వినకపోవడంతోనే తాను రాయి పట్టానని చెప్పింది రాజేశ్వరి. 

Tagged lineman, Peddapalli, A woman, pole , current wire, current bill

Latest Videos

Subscribe Now

More News