ఆదిలాబాద్ ఉట్నూర్ మండలంలో 108 సిబ్బంది ఔదార్యం..

ఆదిలాబాద్ ఉట్నూర్ మండలంలో  108 సిబ్బంది  ఔదార్యం..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో 108 సిబ్బంది తమ ఔదార్యాన్ని చూపారు.  చిన్నుగూడ గ్రామాని  అత్రం భీంబాయి  పురిటి నొప్పులతో బాధపడుతుంది.  అప్పుడు 108 సిబ్బంది సకాలంలో స్పందించడంతో తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు.

చిన్నుగూడ లో గర్భణి నొప్పులతో బాధపడుతున్న సమాచారాన్ని గ్రామస్తులు 108 సిబ్బందికి  అందించారు.  చిన్నుగుడా కు సరైన రోడ్డు మార్గం లేదు‌.   వర్షం తో ఊరికి అడ్డంగా ఉన్నా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో  108 అంబులెన్స్ ను భీంగుడ సమీపంలో నిలిపి... సంఘటన స్థలానికి  108 సిబ్బంది కాలి నడకన చేరుకున్నారు. ఆదివాసి ఆచార సంప్రదాయం తో ప్రసవ మహిళ కు గ్రామస్థులు దూరంగా ఉన్నారు. దీంతో ఇఎంటి  శంకర్ , పైలట్ సచిన్ లు అన్నీ తామై  వాగు ఒడ్డు న వర్షం లో గొడుగులు పట్టుకొని  మహిళకు పురుడు పోశారు.   అనంతరం శిశువును,  తల్లిని స్టేచర్ పై ఎత్తుకొని వాగు దాటించి అంబులెన్స్ ఉట్నూర్ హాస్పిటల్ కు తరలించారు. ఆపద నుంచి మహిళను రక్షించడంతో గ్రామస్తులు  108 సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.