భిక్షం అడుక్కుంటూ 45రోజుల్లో 2.5లక్షలు సంపాధించింది

భిక్షం అడుక్కుంటూ 45రోజుల్లో 2.5లక్షలు సంపాధించింది

అడుక్కునే వాడికి అరవైనాలుగు కూరలు అనే నానుడి మీరు వినే ఉంటారు. దీని అర్థం అడుక్కుతినే వాడి జీవితం సాధారణ ప్రజల కంటే ఎక్కవ లగ్జరీగా ఉంటుంది. సొసైటీలో ఉన్న వారి పట్ల ఉన్న జాలి, దయనే వారికి లక్షలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఇదే అనువుగా తీసుకొని కావాలనే కొంతమంది ఈ వృత్తిలోకి దిగుతున్నారు. చిన్న పిల్లలు, వికలాంగులుగా నటిస్తూ, వృద్ధులు, మహిళలను రోడ్లుపై భిక్షాటన చేస్తున్నారు. 45 రోజుల్లో ఓ మహిళ భిక్షమెత్తి 2లక్షల 50వేలు సంపాధించిందంటే మీరు నమ్ముతారా..? మీరు విన్నది నిజమే.  ఇండోర్ ఇంద్రా భాయి అనే మహిళ తన ఏడుగురు పిల్లలతో బెగ్గింగ్ మాఫియా చేస్తోంది. 

ఇండోర్ లోని రద్దీగా ఉండే టెంపుల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల్లో భిక్షాటన చేయిస్తోంది. సంస్థ ప్రవేక్ అనే ఓ స్వస్ఛంద సంస్థకు ఇంద్రా భాయి పిల్లల్లో ఒకరు తన తల్లి బలవంతంగా బెగ్గింగ్ చేయిస్తుందని చెప్పింది. రంగంలోకి దిగిన ఎజీఓ ఇంద్రా భాయి కూపీ మొత్తం లాగింది. ఆమె చెప్పిన విషయాలు విన్న వారు షాక్ అయ్యారు.

రాజస్థాన్ కోట ప్రాంతంలో రెండస్థుల ఇల్లు, వ్యవసాయ భూమి, భర్తకు బైక్, ఎకౌంట్ లో రూ.50 వేల క్యాష్ తనకు ఉన్నట్లు విచారణలో ఇంద్రా బాయి చెప్పింది. ఆరు వారాల్లో 2లక్షల 50వేలు సాంపాధించినట్లు ఇంటికి రూ.లక్ష పంపించింది. పోలీసులు వారిని పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర రూ.19,600, కూతురి దగ్గర రూ.600 ఉన్నాయి. సోమవారం (ఫిబ్రవరి 12)న ఇంద్రా భాయిని పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్నారు. ఇండోర్ మున్సిపాలిటీలోని 38 రూట్లలో బెగ్గర్స్ అడుక్కుంటూ సంవత్సరానికి రూ.20కోట్లు సంపాధిస్తున్నారని సంస్థ ప్రవేశ్ ఎన్జీఓ అంచనా వేసింది.