ప్రపోజ్ చేస్తే నో అన్నాడని.. ఫ్యాకల్టీపై పగ.. ఫోటోలు మార్ఫింగ్

ప్రపోజ్ చేస్తే నో అన్నాడని..  ఫ్యాకల్టీపై పగ..  ఫోటోలు మార్ఫింగ్

ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే అంగీకరించలేదని తన ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పై పగ పెంచుకుని దారుణానికి ఒడిగట్టింది ఓ యువతి.  అతని భార్య,  రెండేళ్ల కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్స్  క్రియేట్ చేసి న్యూడ్ ఫోటోలను  సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.  ఈ ఘటన హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే యువతి గ్రూప్ వన్ పరీక్ష  రాసింది.  సివిల్స్ కోసం అశోక్‌ నగర్‌లో కోచింగ్ తీసుకుంటుంది.  

ఈ క్రమంలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోని ఫ్యాకల్టీపై మనసు పారేసింది. తన ప్రేమ విషయాన్ని అతనికి చెబితే తనకు ఇది వరకే పెళ్లైందని..  పిల్లలు కూడా ఉన్నారని తిరస్కరించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న  లక్ష్మీ బెదిరింపులతో అతన్ని దక్కి్ంచుకోవాలని అనుకుంది. దీంతో సెకండ్ హ్యాండ్‌ ఫోన్లు కొనుగోలు చేసింది.  

వేరే వాళ్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్  చేసి అందులో ప్రొఫెసర్   భార్య,  రెండేళ్ల కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసింది.  బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  సైబర్ క్రైమ్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.