బెల్లంపల్లి రూరల్, వెలుగు: అబార్షన్ ఫెయిలై యువతి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు, తాండూర్ఇన్చార్జి ఎస్ఐ సౌజన్య తెలిపిన ప్రకారం.. తాండూర్మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24), హైదరాబాద్హయత్నగర్లోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏఎన్ఎంగా చేస్తోంది.
ఆమె సొంతూరికి చెందిన గట్టు జగదీశ్ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేశాడు. హైదరాబాద్లో ఆమెకు అబార్షన్ చేయించేందుకు యత్నించాడు. వీలు కాకపోవడంతో కర్నూలుతీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో బుధవారం అబార్షన్ చేయించేందుకు యత్నించగా తీవ్ర రక్తస్రావమై భాగ్యలక్ష్మి చికిత్సపొందుతూ గురువారం చనిపోయింది.
జగదీశ్ ఫోన్ చేసి భాగ్యలక్ష్మి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిందని మృతురాలి అన్న కుమారస్వామి చెప్పాడు. తన సోదరి మృతికి జగదీశ్ నే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ సౌజన్య తెలిపారు.
