బాలికను గర్భావతిని చేసి.. అబార్షన్ చేయించిన యువకుడు

బాలికను గర్భావతిని చేసి.. అబార్షన్ చేయించిన యువకుడు

బాలికను గర్భావతి చేసి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు ఓ ప్రభుద్ధుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగింది. చేవేళ్ల గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని గర్భవతిని చేశాడు ఓ యువకుడు. 

అయితే ఎవరికీ తెలియకుండా బాలికకు  అబార్షన్ చేయించడంతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో  బాలిక తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు  నిందితుడు సుదర్శన్ పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారు చేవేళ్ల పోలీసులు. సుదర్శన్ ను పట్టుకున్న పోలీసులు..అతడికి పెళ్లి అయ్యిందని.. ఒక బాబు కూడా ఉన్నట్టుగా  గుర్తించారు.