Bengaluru : వ్యక్తిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన యువకుడు..

Bengaluru : వ్యక్తిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన యువకుడు..

ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. బెంగళూరులో ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగుళూరులోని మగాడి రోడ్డులో ద్విచక్రవాహనదారుడు ఓ వ్యక్తిని కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. బాధితుడు స్కూటీని పట్టుకుని వేలాడుతున్నా...నిందితుడు కనికరం చూపలేదు. వెనుక వస్తున్న మరో వాహనదారులు అడ్డుకోవడంతో కిలోమీటర్ తర్వాత బండిని ఆపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ముత్తప్ప ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గోవిందరాజ్ నగర్ పోలీసులు..నిందితుడిని అరెస్ట్ చేశారు. 

  


 
నిందితుడు సుహైల్..తన మహీంద్రా బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని బాధితుడు ముత్తప్ప చెప్పాడు. అతను అప్పటికే ఫోన్ లో మాట్లాడుతున్నాడని.. ఒక్క క్షణం ఆపి క్షమాపణ చెప్పి ఉంటే తనను వదిలి పెట్టేవాడినని చెప్పాడు. అలా కాకుండా పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతని స్కూటీని పట్టుకున్నానని అన్నాడు. మానవత్వం లేకుండా వ్యవహరించిన నిందితుడు సుహైల్ ను కఠినంగా శిక్షించాలని బాధితుడు డిమాండ్ చేశాడు.