
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. పవన్ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. అయితే ఓ అభిమాని ఓజీ బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు పాదయాత్ర చేశాడు.
పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తాళం నవీన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర గా సెప్టెంబర్ 27న కొండగట్టు టెంపుల్ కు చేరుకున్నాడు. ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని సెప్టెంబర్ 23న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర మొక్కు చెల్లించుకొని పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పాడు నవీన్. త్వరలో పవన్ కళ్యాణ్ ను కలుస్తానని అభిమాని నవీన్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఆంజనేయస్వామి దర్శన అనంతరం తిరిగి హైదరాబాద్ బయల్దేరాడు నవీన్.
Also Read : పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్! 'OG' రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
రెండు రోజుల్లోనే రికార్డుల వేట..
మరో వైపు ఈ చిత్రం గురువారం ప్రీమియర్స్, శుక్రవారం కలెక్షన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించినట్లు DVV ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. అయితే సక్నిల్క్ వంటి ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. తొలి రెండు రోజుల్లో 'OG' ఇండియా నెట్ కలెక్షన్ రూ.103.50 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి అందిన రూ.47.35 కోట్ల గ్రాస్‌ను కలుపుకొని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.