ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు

ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు

75 ఏళ్ల స్వతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణ పతకాల రంగులు కలిగిన స్వీట్లు.. భారీ పతాకాలతో ఊరేగింపు.. విద్యార్థులు ఇండియా మ్యాప్ ఆకారంలో మానవహారంగా నిలబడడం..ఇలా వెరైటీగా నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి మాత్రం తన ఖరీదైన కారుకు జాతీయ పతాకం రంగులు వేయించాడు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వార్త, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధార్థ దోషి కుటుంబం గుజరాత్ లోని సూరత్ లో నివాసం ఉంటోంది. ఆగస్టు 15 సందర్భంగా తన దేశభక్తిని విభిన్నంగా జరుపుకోవాలని భావించాడు.

అందులో భాగంగా ఖరీదైన జాగ్వార్ కారుకు త్రివర్ణ పతాకం రంగులు వేయించాలని నిర్ణయించాడు. కారు బోనెట్ తో పాటు డోర్లపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘హర్ ఘర్ తిరంగా ప్రచార లోగోలను వేయించాడు. దీని కోసం రెండు లక్షలు ఖర్చు చేశాడు. త్రివర్ణ పతాక రంగులతో ఉన్న కారులో కుటుంబంతో సహా ఢిల్లీకి పయనమయ్యాడు. 1,300 కిలో మీటర్లు ప్రయాణించి... ఢిల్లీకి చేరుకున్నాడు. పార్లమెంట్ వద్ద కారులో చక్కర్లు కొట్టాడు. అక్కడున్న వారు సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం కోసం తన కారుకు జాతీయ జెండా రంగులు వేయించడం జరిగిందని సిద్దార్థ తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలవాలని ఉందని.. ఇందుకు అపాయింట్ మెంట్ కోరడం జరిగిందన్నారు.