పెళ్లి.. ఒక్కటీ అడక్కు .. టీజర్ రిలీజ్

పెళ్లి.. ఒక్కటీ అడక్కు .. టీజర్ రిలీజ్

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్న  చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మంగళవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్యుడు  చెప్పే ఫన్నీ సీన్‌‌‌‌‌‌‌‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నరేష్​  ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే తను  జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని చెప్తాడు. కానీ అతనికి సరిపోయే అమ్మాయి దొరకదు.

అలాంటి సమయంలో  ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్‌‌‌‌‌‌‌‌గా చెప్పడం.. సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. టీజర్ లాంచ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో నరేష్​ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి నాన్న ఈవీవీ గారు రూపొందించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. దానికి సీక్వెల్ కాదు.

అది  జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా, ఆరోగ్యకరమైన కామెడీ  ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో భాగమవడం హ్యాపీ అంది ఫరియా. ఫ్యామిలీతో  ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది అన్నాడు దర్శకుడు మల్లి. ఈవీవీ గారి టైటిల్‌‌‌‌‌‌‌‌తో వస్తుండడంతో మా మీద పెద్ద బాధ్యత ఉంది అని నిర్మాత  రాజీవ్ అన్నారు. రైటర్ అబ్బూరి  రవి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.