జైన ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూత

జైన ముని ఆచార్య  విద్యాసాగర్ జీ మహారాజ్  కన్నుమూత

జైన  ముని ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్  కన్నుమూశారు.  తెల్లవారుజామున 2:35 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి తీర్థంలో కన్నుమూసినట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడించారు. మూడు రోజుల నుంచి ఆయన ఆహారం, నీరు  తీసుకోవడం లేదని తెలిపారు.  విద్యాసాగర్ జీ మహారాజ్  మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.  ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లుగా మోదీ చెప్పారు.  

 ఛత్తీస్‌గఢ్  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ దొంగగడ్ చేరుకుని జైన సన్యాసి విద్యాసాగర్ మహారాజ్‌ను దర్శించుకున్నారు. దిగంబర అవతారంలో చెక్క బల్లపై కూర్చున్న స్వామిజీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేసిన ప్రధాని..ఆయన పాదాల చెంత నేలపై కూర్చొని అభివందనం చేశారు. 

జైనమతానికి చెందిన ప్రముఖ ఆచార్యులలో ఒకరైన విద్యాసాగర్ జీకి ప్రస్తుతం  77 ఏళ్లు. ఆయన..  1946 అక్టోబర్ 10న కర్ణాటకలో జన్మించారు.   అతనికి 3 సోదరులు మరియు 2 సోదరీమణులు ఉన్నారు.  ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ ఇప్పటివరకు 500 మందికి పైగా సన్యాసులకు దీక్షను అందించారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఛత్తీస్‌గఢ్‌లోని డొంగర్‌గడ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.