ఆధార్ అప్‌డేట్.. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మార్చుకోవడం ఈజీ

ఆధార్ అప్‌డేట్.. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మార్చుకోవడం ఈజీ

ఏ భారతీయ పౌరుడికైనా అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటి ఆధార్ కార్డ్. ముఖ్యమైన పనులన్నింటికి గుర్తింపు కార్డుగా ఆధార్ ఉపయోగపడుతుంది. లోన్, ఇల్లు, బ్యాంక్ ఖాతా, కారు కొనుగోలు వంటి పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ IDని మార్చినప్పుడు,  ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడం మర్చిపోతాము. దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి.  

కొత్త సేవలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ అప్ డేట్ లో  రెండు కొత్త సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఈడీని ఈజీగా మార్చుకోవచ్చు. లేదా వాటిని  ధృవీకరించుకోవచ్చు. UIDAI యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి..ఈ సేవలను పొందవచ్చు.

 

తనిఖీ చేసుకోండిలా..

చాలా మందికి ఇప్పటికీ తమ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో తెలియదు. తమ ఆధార్ కార్డుకు ఏ నెంబర్ లింక్ అయి ఉందో తెలుసుకునేందుకు UIDAI కొత్త సేవను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా  వినియోగదారులు వారి ఆధార్ కు ఏ నెంబర్ లేదా ఈ ఈ మెయిల్ ఐడీ లింక్ చేయబడి ఉందో తెలుసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి..

ఆధార్ కార్డు ఆప్ డేట్ కోసం...


1. UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 
2. ఆ తర్వాత ‘మై ఆధార్ ఆప్షన్’పై క్లిక్ చేయాలి.
3. కొత్త ఆధార్ సేవల పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీపై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు వెరిఫై మొబైల్/ఆధార్ నంబర్‌పై క్లిక్ చేయండి.
5. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ IDని సరిచూసుకోవాలి. 
6. మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో కూడిన  ఈమెయిల్ IDతో పాటుగా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. 
7. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ IDకి OTP వస్తుంది. ఓటిపి ఎంట్ చేసి అప్ డేట్ పై క్లిక్ చేస్తే  మీ ఆధార్ కార్డు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అవుతుంది.