ఆధార్ అప్ డేట్ తప్పనిసరి కాదు

ఆధార్ అప్ డేట్ తప్పనిసరి కాదు

ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు 10 ఏండ్లుగా ఆధార్ అప్ డేట్ చేయకపోతే, తప్పనిసరిగా వాళ్ల వివరాలు అప్ డేట్ చేయాలని, లేదంటే ప్రభుత్వ పథకాలు అందవని చాలారోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనిపై స్పందించిన ఆధార్ యూఐడిఏఐ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ,  ఆధార్ కార్డ్ అప్ డేట్ తప్పనిసరికాదని, ఎవరి వివరాలైతే అవుట్ డేటెడ్ గా ఉన్నాయో వాళ్లనే అప్ డేట్ చేసుకోవాలని చెప్పినట్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో... కొన్నేండ్లముందు ఆధార్ కార్డ్ తీసుకున్న చాలామందికి కార్డ్ లో పేరు, జెండర్, పూర్తి పేరు, అడ్రస్ లు తప్పుగా వచ్చాయి. ఇంకొంతమంది సొంత ఊరిని వదిలి, వేరే చోట్ల సెటిల్ అయిన వాళ్లున్నారు. అలాంటివాళ్లను మాత్రమే ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని మిగితావాళ్లు అవసరం లేదని యూఐడీఏఐ తెలిపింది. 
ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలకు, సేవలు పొందడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరి కాబట్టి, ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం మంచిది. 

ఫోన్లోనే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేయాలంటే....

గూగుల్ క్రోమ్ లో https://myaadhaar.uidai.gov.in సైట్ కి వెళ్లి, ఆధార్ నెంబర్ తో లాగిన్ కావాలి. తర్వాత ‘అప్ డేట్ ఆధార్ ఆన్ లైన్’ పైన  క్లిక్ చేసి, ‘ప్రొసీడ్ టు అప్ డేట్ ఆధార్’ పైన క్లిక్ చేయాలి. అందులో మీకు కావాల్సిన చేంజ్ ని నొక్కి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. చివరగా పేమెంట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.