
హెల్త్ కాన్షియస్ పెరిగిన ఈ రోజుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. బరువు తగ్గడం, కండరాలు నిర్మించడం, ఎక్కువ సమయం కడుపు నిండి ఉంచడం కోసం చాలా మంది ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చేస్తుంటారు. అయితే అధిక ప్రోటీన్ ఆహారం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా అనే ఆందోళన కూడా ఉంది. అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్స్, ఎముకలకు హాని, డయాబెటిస్ వంటి ప్రమాదం ఉందని అంటుంటారు. అయితే వారి ఆందోళనలో నిజమెంత? నిజంగా అధిక ప్రోటీన్లు గల ఆహారం తీసుకుంటే హానకరమా? సైన్స్ ఏం చెబుతుంది?ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన వ్యాసంలో దశాబ్దాల పరిశోధనలను సమీక్షించడం ద్వారా పైన తెలిపిన ఆందోళనలకు ఓ పరిష్కారం చూపించారు పరిశోధకులు.
అధిక ప్రోటీన్ .. దాని చుట్టూ ఉన్న భయాలు..
అధిక ప్రోటీన్ ఆహారం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ఎముకల బలహీనత,టైప్ 2 డయాబెటిస్, జీవిత కాలం తగ్గుతుందనే భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. ఈ ఆలోచనలు కొన్నేళ్లుగా మీడియా, శాస్త్రీయ వర్గాల్లో కూడా ఉన్నాయి. అయితే ఈ భయం జంతు అధ్యయనాలు లేదా మానవులలో స్పష్టంగా నిరూపించని అంచనాల వల్ల వచ్చాయి.
ఈ పరిశోధన ఏం చెబుతుందంటే..
కిడ్నీల ఆరోగ్యం..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే అధిక ప్రోటీన్ గల ఆహారం వల్ల హాని కలుగుతుందని ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. ఎక్కువ ప్రోటీన్ తిన్నపుడు మూత్రపిండాలు కష్టపడి పనిచేస్తాయి. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. ఆరోగ్యంగా ఉన్న మూత్రపిండాలపై ప్రభావం ఉండదు.. అంతకుముందే వ్యాధి బారిన పడిన వారికి మాత్రమే హానికలుగుతుందని చెబుతున్నాయి.
ఎముకల ఆరోగ్యం..
చాలామంది ప్రోటీన్ ఫుడ్ కాల్షియం నష్టం, ఎముకల బలహీనపడటానికి కారణం అవుతుందని నమ్ముతారు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..తగినంత ప్రోటీన్ ఎముకల బలాన్ని పెంచుతుంది. తగినంత ప్రోటీన్ అందే వరకు అధిక ప్రోటీన్ గల ఆహారం ఎముకలను రక్షించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్..
అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం రక్తంలో చక్కెర నియంత్రణను మరింత దిగజార్చుతాయని ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని అధ్యయనాలు జంతు ప్రోటీన్ అధిక డయాబెటిస్ ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చని చూపిస్తున్నాయి.
జంతువులపై చేసిన కొన్ని పరిశోధనలు పరిమిత ప్రోటీన్ ఆయుష్షును పెంచుతుందని సూచిస్తున్నాయి. అయితే దీనిని మానవులకు అనువదించలేదం. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
ఈ కొత్త సమీక్ష ప్రకారం..ఆరోగ్యకరమైన పెద్దలలో అధిక ప్రోటీన్ తీసుకోవడం హాని కలిగిస్తుందనడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. అంటే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తినడం ఎల్లప్పుడూ మంచిదని కాదు - కానీ అది ప్రమాదకరం అని పరిశోధనలు చెప్పలేదు.
నిజానికి చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి,వయస్సుతో పాటు ఎముకలు ,కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రోటీన్లు అవసరమే అని చెబుతున్నాయి.