శ్రద్ధా వాకర్ తర్వాత డాక్టర్తో అఫ్తాబ్ డేటింగ్

శ్రద్ధా వాకర్ తర్వాత డాక్టర్తో అఫ్తాబ్ డేటింగ్

శ్రద్ధా వాకర్ను చంపిన తర్వాత నిందితుడు అఫ్తాబ్ ఓ డాక్టర్తో డేటింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధాను కలిసిన బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారానే డాక్టర్తో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ద్వారా మరికొంతమంది మహిళలతో చాటింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో బంబ్లీ యాప్ కు పోలీసులు లేఖ రాశారు. 

మరోవైపు అఫ్తాబ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సోమవారం నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. హత్యకు దారితీసిన సంఘటనలు, వారి బంధం బెడిసికొట్టడానికి కారణం, అతను శరీర భాగాలను పడేసిన ప్రదేశం, ఉపయోగించిన ఆయుధం తదితర ప్రశ్నలకు సంబంధించి అఫ్తాబ్ నుంచి సమాధానాలు రాబట్టే అవకాశముంది.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను హత్యచేశాడు.ఆ మరుసటి రోజు ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చి.. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు.