సీనియర్ నటులు జీవీ నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించారు. ఈనెల 27న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్లో స్నేహం, మానవత్వం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలోచనలు, భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘మంచు పల్లకి’ స్ఫూర్తితో ‘ఆలోచన’ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది. వృద్ధాప్యంలో స్నేహితులతో కలిసి సమయం గడపడం, ఆలోచనలు పంచుకోవడం ద్వారా మళ్లీ యవ్వనంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అలాంటి మంచి ఆలోచనతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
