ఈసారి 92 స్థానాల్లో గెలుస్తాం : అర్వింద్​ కేజ్రీవాల్​

ఈసారి 92 స్థానాల్లో గెలుస్తాం : అర్వింద్​ కేజ్రీవాల్​

సూరత్: డైమండ్​ సిటీగా పేరున్న సూరత్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ 7–8 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్​లో కచ్చితంగా ఆప్​ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఈసారి 92సీట్లు వస్తాయని ఓ కాగితంపై రాసి మీడియాకు చూపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, పాటిదార్ కోటా మాజీ లీడర్ అల్పేశ్ కతీరియాలు భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. 

ఆప్ అధికారంలోకి వస్తే భయపడుతూ బిజినెస్​ చేసే రోజులు ఉండవని భరోసా ఇచ్చారు. మహిళలు, యువత ఆమ్​ ఆద్మీ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్​ స్కూళ్లలో ఫీజుల పెంపు ఉండదన్నారు. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల్లేని రాష్ట్రంగా గుజరాత్​ను చూడాలనుకుంటే ఆప్​కు ఓటేయాలని సూచించారు. గవర్నమెంట్​ ఎగ్జామ్​ పేపర్​ లీక్​ చేసే వారికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా చూస్తామని, నిరుద్యోగులకు ప్రతీనెల రూ.3 వేల అలవెన్స్ ఇస్తామని చెప్పారు. బీజేపీకి తమకు మధ్య పోటీ లేదని, గుజరాత్​లో తామే ముందంజలో ఉన్నామని కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు.