పాట కోసం సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జిత్ ఇంటికెళ్లి రిక్వెస్ట్ చేసిన అమీర్ ఖాన్ ..

పాట కోసం సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జిత్ ఇంటికెళ్లి రిక్వెస్ట్ చేసిన అమీర్ ఖాన్ ..

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ సినిమా కోసం ఏం చేయడానికైనా, ఎంతదూరం వెళ్లడానికైనా వెనుకాడరు.  తన కొడుకు జునైన్ ఖాన్ హీరోగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’.  సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటను ప్రముఖ సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జిత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాడించాలనుకున్నారు ఆమీర్ ఖాన్. కానీ ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టడం కోసం ఇటీవల ప్లే బ్యాక్ సింగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు అర్జిత్ సింగ్.  ఆమీర్ మాత్రం ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనతోనే పాడించాలని పట్టుబట్టారు. 

పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో, ముర్షిదాబాద్ జిల్లాలోని అర్జిత్ సొంతూరు జియాగంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. ఆమీర్ ఖాన్ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెతుక్కుంటూ రావడం చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు పాడటం ఆపేస్తే మా పరిస్థితి ఏంటి’ అంటూ అర్జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒప్పించారు. తన ఇంట్లోనే నాలుగు రోజులు ఉన్నారు. అర్జిత్ ఇంట్లో కింద కూర్చొని భోజనం చేయడం మొదలు, తన స్కూటీపై ఊరంతా తిరగడం, డాబాపై గాలిపటాలు ఎగరేయడం,  చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం వరకు  ఓ కామన్ మ్యాన్ తరహాలో అక్కడి వాళ్లతో కలిసిపోయారు. మొత్తానికి అర్జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాట పాడించారు. ఈ పాటతోపాటు ఇందుకు సంబంధించిన వీడియోను సోమవారం విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 1న సినిమా విడుదల కాబోతోంది.