
బాలీవుడ్ స్టార్ హీరోగా, మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం కిరణ్ రావుతో విడిపోయిన తర్వాత మరో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇటీవల కాజోల్ , ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న టాక్ షో 'టూ మచ్'లో పాల్గొన్న ఆమిర్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ప్రస్తుత భాగస్వామి గౌరీ స్ప్రట్ తో తనకున్న ప్రేమ బంధం, అలాగే మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఇప్పటికీ కొనసాగిస్తున్న సుహృద్భావ సంబంధం గురించి మనసు విప్పి మాట్లాడారు.
విడాకులు బాధాకరమే కానీ..
మాజీ భార్యలు రీనా , కిరణ్ తో విడిపోవడం తన జీవితంలో "తీవ్రమైన బాధ" (Traumatic)తో కూడినదని ఆమిర్ అంగీకరించారు. నా అదృష్టం ఏంటంటే.. నేను పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు మహిళలు చాలా గొప్పవాళ్లు. రీనా దత్తా , కిరణ్ రావు ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు. అందుకే మేము విడిపోయినా, ఇప్పటికీ కుటుంబంగానే ఉన్నాం. విడాకుల తర్వాత కూడా మాజీ భాగస్వాములతో గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన బంధాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వారు ఇప్పటికీ సినిమాల నిర్మాణ సంస్థలో కూడా భాగస్వాములుగా ఉన్నారు.
గౌరీ స్ప్రట్‌తో కమిట్‌మెంట్
తన ప్రస్తుత భాగస్వామి గౌరీ స్ప్రట్‌తో ఉన్న బంధం గురించి ఆమిర్ ఆసక్తికమైన విషయాలు పంచుకున్నారు. ఒక బంధానికి కట్టుబడి ఉన్నప్పుడు, కేవలం కాగితంపై సంతకం చేస్తేనే పెళ్లి కాదు అన్నారు. మీరు నిజంగా ఒక వ్యక్తితో కనెక్ట్ అయితే, కొన్నిసార్లు అది పెళ్లితో సమానం. గౌరీ, నేను కలిసి ఉన్నాం. మేము ఒకరికొకరం చాలా కమిటెడ్ కు కట్టుబడి ఉన్నాం అని ఆమిర్ తన బంధాన్ని స్పష్టం చేశారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీతో తన ప్రేమబంధాన్ని అధికారికంగా ఆమిర్ ఖాన్ ధృవీకరించారు. అప్పటి నుండి ఈ జంట పలు బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించారు
ఆమిర్ వ్యక్తిగత జీవితం
ఆమిర్ ఖాన్ మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్ ఖాన్, కుమార్తె ఐరా ఖాన్ ఉన్నారు. 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, ఆమిర్ 2005లో ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 2021లో విడిపోయినప్పటికీ, వీరు తమ కుమారుడు ఆజాద్ కు తల్లిదండ్రులుగా కలిసి ఉంటున్నారు. అంతే కాదు సినిమా నిర్మాణ సంస్థ 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్'లో భాగస్వాములుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జునైద్ ఖాన్ సినిమా రంగంలోకి అడుగుపెడుతూ బిజీగా ఉన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఆమిర్ ఖాన్ తన జీవితంలో ప్రతి బంధానికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత విలువ ఇస్తారో అర్థమవుతుంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.