బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ తో మెగాస్టార్ మూవీ..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ తో మెగాస్టార్ మూవీ..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి సినిమా చేయనున్నారా అంటే ఆ ఇద్దరు హీరోలు అవుననే అంటున్నారు. తమ కాంబినేషన్లో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ మూవీ చేసేందుకు చిరు కండీషన్స్ పెట్టడం విశేషం. 

అమీర్ ఖాన్, నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు చిత్ర సమర్పకుడు చిరంజీవి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఓ టీవీ ఛానల్ కోసం నాగార్జున వారితో జరిపిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అమీర్.. చిరుతో కలిసి దర్శకుడిగాగానీ, నిర్మాతగా గానీ ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. దీనికి రియాక్టైన చిరంజీవి ఓ కండీషన్ పెట్టారు. అన్నీ సీన్లు ఫస్ట్ టేక్ కే ఓకే చేస్తానంటేనే తాను సినిమా చేస్తానని చెప్పారు. మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరున్న అమీర్ సీన్ తనకు కావాల్సినట్లు వచ్చేంత వరకు టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు. అందుకే చిరు ఈ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

చిరు మాటలకు కొనసాగింపుగా నాగార్జున దర్శకత్వం వద్దు మీరు నిర్మాతగా ఉంటేనే బెటరేమో అని అన్నారు. అయితే నిజంగా చిరు, అమీర్ ల కాంబినేషన్ లో సినిమా రానుందా అంటే అనుమానమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రమోషన్లలో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం మామూలేనని అంటున్నారు. అయితే అమీర్ ఖాన్ ఆ మాట అన్నాడంటే అందులో సీరియెస్ నెస్ ఉంటుందని ఆయన స్టేట్ మెంట్ల కోసం అలాంటి వ్యాఖ్యలు చేయరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ నటించిన ఏ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారని చిరును నాగ్ ప్రశ్నించగా.. తాను రీమేక్ చేయనని,  అమీర్ సినిమాలను చూడటమే తప్ప చేయడం కుదరదని అన్నారు.