నుపుర్‌ శిఖారేతో అమీర్ ఖాన్‌ కూతురు ప్రేమాయణం

నుపుర్‌ శిఖారేతో అమీర్ ఖాన్‌ కూతురు ప్రేమాయణం

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. గత 2 ఏళ్ల నుంచి ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. తాజాగా నుపుర్ తో ఐరా ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఇటీవల నుపుర్‌ సైక్లింగ్‌ పోటీల కోసం విదేశాలకు వెళ్లగా.. ఆయనతో పాటు ఐరా ఖాన్ కూడా వెళ్లింది. 

అయితే అక్కడ పోటీలు ముగిశాక నుపుర్‌ ఐరా కు ప్రపోజ్ చేసి వేలుకి రింగ్ కూడా తోడిగాడు. ఈ విషయాన్ని ఐరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఈ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు.