ఢిల్లీలో నీటి కష్టాలు.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్ సర్కార్..

ఢిల్లీలో నీటి కష్టాలు.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్ సర్కార్..

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిన నేపథ్యంలో దేశంలో చాలా చోట్ల నీటి ఎద్దడి ఏర్పడింది. బెంగళూరు లాంటి ఢిల్లీ లాంటి మహా నగరాల్లో కూడా నీటి ఎద్దడి తీవ్రమైంది. బెంగళూరులో నీటిని వృధా చేస్తే జరిమానా విధిస్తామని ప్రభుత్వమే ఆదేశాలిచ్చే స్థాయిలో నీటి కష్టాలు తలెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీటి ఎద్దడి తీవ్రమైంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అదనపు నీటిసరఫరా కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి అదనపు నీరు అందించాలని కోరారు కేజ్రీవాల్.

 

నెలరోజుల పాటు నీటి సరఫరా చేయాలని హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేజ్రీవాల్. రాజకీయాలకు ఇది సమయం కాదని, నిరసనల వల్ల నీటి కొరత తీరదని అన్నారు కేజ్రీవాల్.ఢిల్లీలో నీటి కొరతకు బీజేపీనే కారణమని అన్నారు. ఢిల్లీలో నీటి వినియోగం పెరిగి, డిమాండ్ పెరుగుతుంటే మరో పక్క పొరుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి అందాల్సిన వాటా తగ్గుతోందని అన్నారు కేజ్రీవాల్. ఇదిలా ఉండగా ఢిల్లీ వాసుల నీటి కష్టాలు తీవ్రం కాకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ట్యాంకర్లను మానిటర్ చేసేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఢిల్లీలో ప్రస్తుతం నీటి విషయంలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, నీటిని పొదుపు చేసే విషయంలో నగరవాసులు సహకరించాలని కోరారు మంత్రి అతిశీ అన్నారు. ఈ ఎమర్జెన్సీ పరిస్థితికి పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక కారణమైతే, హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవటం మరొక కారణమని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు.