బీజేపీలోకి హిమాచల్ ప్రదేశ్ ఆప్ ప్రెసిడెంట్

బీజేపీలోకి  హిమాచల్ ప్రదేశ్ ఆప్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల విజయంతో ఫుల్ జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. హిమాచల్ ప్రదేశ్ ఆప్ ప్రెసిడెంట్ అనూప్‌ కేసరితో పాటు ఆ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉనా జిల్లా అధ్యక్షుడు ఇక్బాల్ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో వారు బీజేపీలో చేరారు. నడ్డా, అనురాగ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాగా పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీరు భరించలేక పార్టీని వీడుతున్నట్లు అనూప్ కేసరి తెలిపారు. ఎనిదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డామని, కానీ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఒంటెద్దు పోకడతో విసిగిపోయి బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. పంజాబ్ లో విజయం సాధించిన సందర్భంగా ఏప్రిల్ 6న ఆప్ హిమాచల్ ప్రదేశ్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు స్థానిక నేతలను పట్టించుకోలేదని అక్కడి ఆప్ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ కారణంగానే ఆప్ కీలక నేతలు బేజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తల కోసం...

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​

బీస్ట్.. నెక్స్ట్​ లెవెల్​