ఇండియా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నం: కేజ్రీవాల్

ఇండియా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నం: కేజ్రీవాల్

ఇండియా కూటమికి మద్దతివ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.   డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టయిన తర్వాత కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో స్పందించిన   అరవింద్ కేజ్రీవాల్.. I.N.D.I.A కూటమి  నుంచి వైదొలగబోమని..కూటమి ధర్మాన్ని  నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

పంజాబ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన  వివరాలు తన  దగ్గర లేవన్నారు కేజ్రీఆల్.   అయితే  డ్రగ్స్ ను  అంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో  ఒక వ్యక్తి ఎంత పెద్దవాడైనా, చిన్నవాడైనా, అతన్ని విడిచిపెట్టబోరన్నారు. 

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద 2015లో నమోదైన పాత కేసుకు సంబంధించి పంజాబ్ పోలీసులు  కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను అరెస్టు చేశారు. కోర్టు అతడికి రెండు రోజుల కస్టడీ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుందని ఆరోపిస్తూ ఖైరా అరెస్టుపై పంజాబ్ కాంగ్రెస్ భగవంత్ మాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.