అక్టోబర్ 1 నుంచి రాజస్థాన్లో పెట్రోల్ బంకులు బంద్..

అక్టోబర్ 1 నుంచి రాజస్థాన్లో పెట్రోల్ బంకులు బంద్..

రాజస్థాన్ రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. రాజస్థాన్ లోని పెట్రోల్ పంప్ ఆపరేటర్లు అక్టోబర్ 1 నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

సమ్మెకు కారణమిదే..

రాజస్థాన్లో పెట్రోల్ పంప్ ఆపరేటర్ల సమ్మెకు కారణం ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచడమే. ఇప్పటికే దేశంలో రాజస్థాన్ లోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయి. దీనికి తోడు తాజాగా పెంచిన వ్యాట్తో ఈ రేట్లు మరింత పెరిగాయి. దీంతో పెంచిన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ..సెప్టెంబర్ 13,14వ తేదీల్లో పెట్రోల్ పంప్ ఆపరేటర్లు ఇప్పటికే సమ్మె చేశారు. రెండు రోజుల పాటు సమ్మె చేసినా..ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలిచి పెట్రోల్ పంప్ ఆపరేటర్లతో మాట్లాడింది. 10 రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో  నిరవధిక సమ్మెను వాయిదా వేశారు. 

ALSO READ : బంగారం దొంగలు దొరికారు.. 18 కేజీలు రికవరీ

13 రోజులు గడిచినా  వ్యాట్ తగ్గింపుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 సమ్మెకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె చేస్తామని  ప్రకటించింది. అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే..అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే రాజస్థాన్ లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ అధికంగా విధిస్తున్నారని ఆ రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.