
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఎక్స్ ( ట్విట్టర్ )లో ఇవాళ తొలి పోస్ట్ పెట్టారు.తన భార్యత టీ తాగుతున్న ఫోటోను షేర్ చేశారు. 17 నెలల తర్వాత లభించిన స్వేఛ్చలో ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో టీ తాగుతున్నానని పోస్ట్ చేశారు. భారతీయులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్గించింది. అందరితో కలిసి ఊపిరిపీల్చుకునే స్వేఛ్చ కల్పించాడు భగవంతుడు అని అన్నారు.
17 నెలలుగా కస్టడీలో ఉన్నారని, కేసు విచారణలో ఆలస్యమవుతున్నందును సుప్రీం కోర్టు ఆగస్ట్ 9న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే..2023 అక్టోబర్ నుంచి కేసులో ఎలాంటి పురోగతిలేదని అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైల్లో ఉంచడం అతడి హక్కులను హరించడమే అవుతుందని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈమేరకు మనీశ్ సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఇంకా విచారణ ఎందుకు ప్రారంభించలేదంటూ ఈడీ, సీబీఐ అధికారులను ప్రశ్నించింది. సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు రాగానే...ఆప్ మద్దతుదారులు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సిసోడియాను ర్యాలీగా తీసుకెళ్లారు.
आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!
— Manish Sisodia (@msisodia) August 10, 2024
वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।
वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF