ఇండియా కూటమికి బిగ్ షాక్.. ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

ఇండియా కూటమికి బిగ్ షాక్.. ఒంటరిగానే  పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది.  పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేస్తారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరివింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.  పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, చండీగఢ్‌లోని 1 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.  త్వరలోనే అభ్యర్థులరను కూడా ప్రకటిస్తామన్నారు.   తమ అభ్యర్థుల విజయానికి ప్రజల ఆశీర్వాదం కావాలని  కోరారు.  .పంజాబ్ ప్రభుత్వం  రేషన్ డోర్ స్టెప్ డెలివరీ కోసం ఏర్పాటు చేసిన సభలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

ALSO READ :- ఇంత దారుణమా: బైకర్ను చితక్కొట్టిన కానిస్టేబుల్..హెల్మెట్ లేకుంటే ఇలా కొడతారా

పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఇప్పటికే ప్రకటించారు.  తాజాగా కేజ్రీవాల్ కూడా అదే దారిని ఎంచుకున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఉన్న ఇండియా కూటమికి కేజ్రీవాల్ ప్రకటన పెద్ద దెబ్బే అని చెప్పాలి.  ఇక బీహార్ లో నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చ ఎన్‌డీఏతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.