జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే దిశగా ఆప్

 జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే దిశగా ఆప్

లక్నో: జాతీయ రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తోంది. పంజాబ్ లో అఖండ విజయం సాధించిన సందర్భంగా మార్చి 12న యూపీలో విజయోత్సవ ర్యాలీలు తీయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకొని సంచలన విజయం సాధించింది. ఫలితాల అనంతరం మాట్లాడిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యమ్నాయం ఆప్ ఒక్కటేనని అన్నారు. దేశవ్యాప్తంగా ఆప్కున్న సానుకూల పరిస్థితులను చేజిక్కించుకునే పనిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ఆప్ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. యూపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిపై  సమీక్ష చేస్తామని అన్నారు. కాగా.. యూపీలో 403 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

మరిన్ని వార్తల కోసం...

కారు చివర్ల ల్యాండైన హెలికాప్టర్​ను చూసిన్రా! 

ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా