కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ టెక్నీషియన్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, వెల్ఫేర్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 160
విభాగాల వారీగా ఖాళీలు
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఇనుస్ట్రుమెంట్స్) 39
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్) 43
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ (మెషినిస్ట్) 3
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఆప్టికల్ వర్కర్) 12
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రోప్లేటర్) 1
- వెల్ఫేర్ ఆఫీసర్ 3
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (కెమికల్) 1
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 2
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) 23
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) 24
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఆప్టిక్స్ & కోటింగ్) 7
- కన్సల్టెంట్ (కో–ఆర్డినేషన్) 2
ఎలిజిబిలిటీ
ప్రాజెక్ట్ టెక్నీషియన్: అభ్యర్థులు పదోతరగతి (మ్యాట్రిక్యులేషన్) ఉత్తీర్ణతతోపాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) నుంచి సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఎన్టీసీ) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్ఏసీ) కలిగి ఉండాలి.
వెల్ఫేర్ ఆఫీసర్: కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ (హెచ్ఆర్ఎం) లేదా లేబర్ వెల్ఫేర్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా/ సంబంధిత రంగంలో కనీసం 60శాతం మార్కులతో బీఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్ (కో-ఆర్డినేషన్): భారత సైన్యంలో ఆర్మర్డ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, కార్ప్స్ ఆఫ్ ఆర్టిలరీ, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లేదా కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ విభాగాల నుంచి మేజర్ లేదా లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఆఫీసర్లు అయి ఉండాలి.
వయసు
- ప్రాజెక్ట్ టెక్నీషియన్: 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- వెల్ఫేఆర్ ఆఫీసర్: 27 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- కన్సల్టెంట్ (కో-ఆర్డినేషన్): 62 ఏళ్లు మించకూడదు.
ఇతర వివరాలు
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: అక్టోబర్ 3.
సెలెక్షన్ ప్రాసెస్
ప్రాజెక్ట్ టెక్నీషియన్: ఎన్టీసీ/ ఎన్ఏసీ తుది పరీక్షలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా ట్రేడ్ టెస్ట్ (ప్రాక్టికల్) కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. తుది మెరిట్ జాబితాను పూర్తిగా ఎన్టీసీ/ ఎన్ఏసీ మార్కుల ఆధారంగానే ఖరారు చేస్తారు.
వెల్ఫేర్ ఆఫీసర్: బ్యాచిలర్ డిగ్రీలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: డిప్లొమా లేదా బీఎస్సీలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు. డిప్లొమా/ బీఎస్సీ మార్కులకు 75 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభకు 25 శాతం వెయిటేజీ ఇస్తూ తుది మెరిట్ జాబితా తయారుచేస్తారు.
కన్సల్టెంట్ - కోఆర్డినేషన్: స్క్రీనింగ్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ indiaoptel.inను సందర్శించండి.
