ఆ ఐదుగురు మంత్రులకు ఓటమి తప్పదా..?

ఆ ఐదుగురు మంత్రులకు ఓటమి తప్పదా..?

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ  హావా చూపిస్తోంది. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం సాయంత్రం 5గంటలకు  తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఇందులో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నట్లు చెప్పగా.. కొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తెలిపాయి. ఆరా మస్తాన్ సర్వేలో కాంగ్రెస్ 58 - 67 సీట్లు (41.13 శాతం ఓట్లు) తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తన ఎగ్జిట్ పోల్ లో బీఆర్ఎస్ కు 41 - 49 సీట్లు (39.58 శాతం ఓట్లు), బీజేపీకి 5 - 7 సీట్లు( 10.47 శాతం ఓట్లు), ఏంఐఏం, బీఎస్పీ, సీపీఐ  7 - 9 సీట్లు (8.82 శాతం ఓట్లు) వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరని విమర్శ ఎక్కువగా ఉందని తన సర్వేలో ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. సంక్షేమ పథకాలు బాగున్నా, ప్రభుత్వం కుటుంబ పాలనగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడినట్లు పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం వల్ల రాష్ట్ర రాజకీయాలు మారాయని, 
కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్మారని తెలిపింది. కవిత అరెస్ట్ కాకపోవడంతో అటు బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయినట్లు వెల్లడించింది.

గత  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన సెటిలర్స్.. ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపే నిలిచారని సర్వే తెలిపింది.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వల్లే సెటిలర్స్ బీఆర్ఎస్ దూరమైనట్లు పేర్కొంది. దీంతోపాటు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతోనూ పార్టీకి నష్టం చేకూర్చినట్లు తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ హైలెట్స్:

 • హైదరాబాద్, కరీంనగర్ లో బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి
 • ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి
 • 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు
 • నిర్మల్ లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్
 • ముదోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్
 • బాల్కొండలో మంత్రి  ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం
 • కరీంనగర్ లో స్వల్ప ఆధిక్యంతో బండిపై మంత్రి గంగుల గెలిచే ఛాన్స్
 • సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్
 • కామారెడ్డిలో మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కేసీఆర్ ఉండోచ్చు
 • హుజురాబాద్ లో స్వల్ప తేడాతో ఈటెల -కౌశిక్ రెడ్డి ఎవరైనా గెలవొచ్చు 
 • హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్
 • సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్
 • దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్
 • గజ్వేల్ లో తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్
 • మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్
 • అంబర్ పేటలో కారుకే ఛాన్స్
 • తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు
 • వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్
 • కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్
 • కొల్లాపూర్ లో జూపల్లి గెలిచే ఛాన్స్ బర్రెలక్కకి 10 వేల ఓట్లు
 • ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు
 • కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు
 • మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్
 • ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్
 • పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది
 • కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది
 • బీఆర్ఎస్ గెలిచే స్థానాలను బీజేపీ గెలవబోతోంది
 • బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కి 90 స్థానాలు వచ్చేవి