ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి కెప్టెన్‌‌‌‌గా ఆరోన్‌‌‌‌ జార్జ్‌

ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి కెప్టెన్‌‌‌‌గా ఆరోన్‌‌‌‌ జార్జ్‌

న్యూఢిల్లీ: జూనియర్ క్రికెట్‌‌‌‌లో దుమ్మురేపుతున్న హైదరాబాద్ యంగ్‌‌‌‌స్టర్ ఆరోన్ జార్జ్‌‌‌‌కు నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు నాయకత్వం వహించే అరుదైన అవకాశం దక్కింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈ నెల 17 నుంచి 30 వరకు జరిగే అండర్‌‌‌‌‌‌‌‌19 ట్రై సిరీస్‌‌‌‌లో పాల్గొనే  ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి జట్టుకు కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యాడు.

 ఈ మేరకు జూనియర్ క్రికెట్ కమిటీ మంగళవారం జట్లను ప్రకటించింది.  హైదరాబాద్‌‌‌‌కు చెందిన కీపర్ ఆర్‌‌‌‌‌‌‌‌. అలంకృత్‌‌‌‌, వాఫి కచ్చి, మహ్మద్ మాలిక్‌‌‌‌ ఇండియా–ఎ టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు విహాన్ మల్హోత్రా కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు. ఈ  సిరీస్‌‌‌‌లో ఇండియా– ఎబి జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్‌‌‌‌‌‌‌‌19 మూడో జట్టుగా పాల్గొంటుంది.