డివిలియర్స్ ఆట ఎప్పటికీ గుర్తుండిపోతుంది

డివిలియర్స్ ఆట ఎప్పటికీ గుర్తుండిపోతుంది

పద్నాలుగో సీజన్ ఐపీఎల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్‌గా ఆరంభించింది. ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ ధర పెట్టి దక్కించుకున్న మ్యాక్స్ వెల్, కెప్టెన్ కోహ్లీతో పాటు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ రాణించారు. ముఖ్యంగా కీలక సమయంలో డివిలియర్స్ క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అందుకే డివిలియర్స్ మీద విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లులు కురిపించాడు. ఏబీ కాలాతీత ఆటగాడని కొనియాడాడు.

'డివిలియర్స్ కలకాలం నిలిచిపోయే ప్లేయర్. అతడికి అనుభవం ఉంది. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లి ఔట్ అయిన టైమ్‌లో డివిలియర్స్ అవసరం ఆర్సీబీకి చాలా ఉంది. సరైన టైమ్‌లో అతడు నిలదొక్కుకుని అద్భుతంగా మ్యాచ్‌ను ముగించాడు. ఈ పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుంటుంది. స్ట్రైక్ రొటేషన్, హిట్టింగ్, మ్యాచ్‌ను నియంత్రిస్తూ ఏబీ ఆడిన తీరు అమోఘం' అని లారా మెచ్చుకున్నాడు.