
రివ్యూ: ఎబిసిడి
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు : అల్లు శిరీష్,రుక్షర్ దిల్లాన్,భరత్,కోట శ్రీనివాసరావు,నాగబాబు,వెన్నెల కిషోర్,రాజా,శుభలేఖ సుధాకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్
మ్యూజిక్: జుడా సాండీ
నిర్మాతలు: యశ్ రంగినేని,మధురా శ్రీధర్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
కథేంటి?
అరవింద్ (అల్లు శిరీష్) అమెరికా లో పుట్టి పెరిగిన రిచ్ కిడ్.అక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు..,తనకు డబ్బు విలువ తెలియాలని భావించిన వాళ్ల నాన్న (నాగబాబు) ఇండియాకు పంపిస్తాడు.నెలకు 5 వేలు మాత్రమే బతకడానికి ఇస్తాడు.ఆ డబ్బుతో ఇక్కడ తను ఎలా మేనేజ్ చేసాడు..ఎన్ని కష్టాలు పడ్డాడు.తర్వాత తను పొలిటికల్ సవాళ్లను ఎలా ఎదుర్కున్నాడనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్ దేసీ గా అల్లు శిరీష్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అందించాడు.ఆ రోల్ కు ఆయన సూటయ్యాడు.హీరోయిన్ రుక్షర్ ధిల్లాన్ చాలా అందంగా కనిపించింది.వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కాడా నవ్విస్తుంది.ఫ్రెండ్ క్యారెక్టర్ లో భరత్ ఫర్వాలేదనిపించాడు.నాగబాబు,శుభలేఖ సుధాకర్,రాజా,కోట శ్రీనివాసరావు తదితరులు వాళ్ల పాత్రల్లో రాణించారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్:
రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది.ప్రతీ ఫ్రేమ్ ను నీట్ గా చూపించాడు.జుదా సాండీ మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.డైలాగులు ఓకే.
విశ్లేషణ:
‘‘ఎబిసిడి’’ రెగ్యులర్ యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్.. అక్కడక్కడా మాత్రమే అలరిస్తుంది..మేజర్ పార్ట్ వరకు ఇలాంటి సినిమా ఎక్కడో చూసినట్టు,నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందో తెలిసేలా ఉంటుంది.మలయాళం సినిమా ‘‘ఎబిసిడి’’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్కడ దుల్ఖర్ చేసిన మ్యాజిక్ ను ఇక్కడ అల్లు శిరీష్ చేయలేకపోయాడు. దాదాపు ఆరేళ్ల క్రితం అక్కడ రిలీజైన ఈ మూవీ రీ ఫ్రెషింగ్ అనిపించివుంటుంది.కానీ ఇలాంటి కథలు తెలుగులో వచ్చాయి.ఇక కొన్ని సీన్ల వరకు మార్చినా పలితం లేకపోయింది.
దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకుడిగా ఫర్వాలేదనిపించినా..స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. క్లారిటీ మిస్ అయ్యి కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ప్రీ క్లైమాక్స్ లో యూత్ ఐకాన్ అనే పాయింట్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అలాగే హీరో ఇచ్చే లెక్చర్లు కూడా పెద్దగా ఎక్కవు. ఫస్టాఫ్ ఫన్ గా సాగిన ఈ ఎన్నారై జర్నీ… సెకండాఫ్ కు వచ్చే సరికి బోరింగ్ గా సాగింది. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త రిలీఫ్ ను ఇస్తుంది.ఒవరాల్ గా చూసుకుంటే ‘‘ఏబిసిడి’’ టైమ్ పాస్ మూవీగా ఫర్వాలేదనిపించినా..అల్లు శిరీష్ కు మాత్రం హీరోగా బ్రేక్ ఇవ్వలేకపోయింది.